Friday, April 19, 2024

గురుకులాల్లో సైకాలజిస్టులను నియమించాలి

- Advertisement -
- Advertisement -

Psychologists should be appointed in Gurukul

 

మంత్రి కొప్పులకు సైకాలజిస్టుల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో సైకాలజిస్టులను నియమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ప్రభుత్వానికి సూచించింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాంచందర్ ఆధ్వర్యంలో సైకాలజిస్టులు ఎ.సుధాకర్, బి.అరుణ్ కుమార్, వై.శివరామప్రసాద్, దేదిప్యలు గురువారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గాను సైకాలజిస్టుల తోడ్పాటు అవసరమని అన్నారు. తమ విజ్ఞప్తిని వెంటనే పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు. సైకాలజిస్టుల సంఘం విజ్ఞప్తిని తప్పక పరిశీలిస్తానని మంత్రి వారికి హామీనిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News