Home స్కోర్ మోడీకి పి.టి.ఉష నిరసన లేఖ

మోడీకి పి.టి.ఉష నిరసన లేఖ

Untitled-99కొచ్చిన్: బాలురు, బాలికలకు అథ్లెటిక్స్ ఈవెంట్లు వేర్వేరుగా నిర్వహించాలని స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎస్‌ఐ) తీసుకున్న నిర్ణయాన్ని నిరసి స్తూ ట్రాక్ దిగ్గజం పి.టి. ఉష ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశా రు. వారి క్యాలెండర్లో జనవరి రెండవ వారంలో, డిసెంబర్ నాలుగవ వారంలో నాసిక్,పుణెలలో వేర్వేరుగా బాల, బాలి కలకు అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొనడాన్ని ఆమె తన లేఖలో ఉటంకించారు. ప్రపంచం అంతా లింగ వివక్ష లేకుండా సమానత్వం కోసం ఘోషిస్తుంటే ఎస్‌జిఎస్‌ఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయం అన్నారు. పోటీ లన్నవి పాత కాలంలోనే బాలబాలికలకు, స్త్రీపురుషులకు వేర్వే రుగా నిర్వహించేవారని ఆమె పేర్కొన్నారు. పైగా ఇది అంత ర్జాతీయ ఒలింపిక్ చార్టర్‌కు వ్యతిరేకమని కూడా అన్నారు. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి అవసరమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆమె కోరారు. ఆమె ఇదివరలో జాతీయ అథ్లెటిక్స్ కోచ్‌గా పనిచేశారు.