Friday, March 29, 2024

గులాబీకి జై కొట్టిన ప్రజా సంఘాలు

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని పిలుపు
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 35 బిసి సంఘాల మద్దతు ప్రకటన
ప్రజా సంక్షేమం సిఎం కెసిఆర్‌తో సాధ్యమని ప్రశంసలు
విద్యార్థులకు రాజకీయ అవకాశం గులాబీ పార్టీతో సాధ్యం
ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ విద్యార్థి నాయకులు

Public associations support to TRS Party

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: హూజూరాబాద్ పోరులో గులాబీ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజాసంఘాలు, ఉద్యమ,కుల, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎన్నికలు ఈనెల 30న జరుగుతుండటంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఇప్పటికే నగర నుంచి పెద్ద ఎత్తున ప్రచారాకి కదలి వెళ్లారు. తెలంగాణ అభివృద్ది సిఎం కెసిఆర్‌తో సాధ్యమని, ప్రజలను మభ్యపెట్టే నాయకులకు తగిన బుద్ది చెప్పిలని కోరుతున్నారు. రైతుబంధు,రైతుభీమా, దళిత బంధు, వృద్దులు, వితంతులకు ఫించన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పేద ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ సుస్దిర స్దానం సంపాదించుకుంది. రాజకీయ పదవులు అనుభవించి కోట్లాది రూపాయల అక్రమ సంపాదన మూటగట్టకున్న నాయకుల అక్రమాలకు ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీ యువకుడు, బిసీ వర్గాలకు చెందిన విద్యార్థి నాయకునికి టికెట్ ఇవ్వడం హర్షనీయమని సంఘాల నాయకులు పేర్కొన్నారు.

తాజాగా రాష్ట్రంలో బిసి కులాల అభ్యున్నతి కోసం ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిసి సంక్షేమ సంఘం టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించి, హూజూరాబాద్ బిసిలంతా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. బీసిల జనగణన చేయకుండా నిర్లక్షం చేసి, బడుగు, బలహీన వర్గాల పట్ల వ్యతిరేకం ప్రదర్శిస్తున్న పార్టీలను అడ్రస్సు లేకుండా చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరుగుదల చూస్తుంటే సామాన్యుడు జీవించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి గురుకులాలు, గొల్ల,కురుమలు, మత్సకారులను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఆయనతో పాటు 36 బిసి సంఘాలు టిఆర్‌ఎస్ అభ్యర్దికే జై కొట్టాయి. వీరే కాకుండా తెలంగాణ ప్రజా ఉద్యమాల వేదిక, తెలంగాణ సామాజిక కార్యకర్తల వేదిక, బీసి విద్యావంతులు వేదిక, తెలంగాణ మైనార్టీ సంక్షేమ సంఘాలు మద్దతు ప్రకటించి హుజూరాబాద్ ప్రచారానికి వెళ్లారు.

ప్రతి ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించే ఉస్మానియా విద్యార్థి జేఏసీ కూడా గత రెండు రోజుల నుంచి ప్రచారం చేస్తుంది. జేఏసీ చైర్మన్ తొట్ల స్వామి, సభ్యులు బొల్లునాగరాజు, కడారి స్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఓయూ విద్యార్థినేతలైన బాల్కం సుమన్, గాదరి కిషోర్, పిడమర్తి రవి, అంజనేయులు గౌడ్, కిషోర్‌గౌడ్ వంటి యువకులకు పార్టీ సముచిత స్దానం కల్పించి ప్రజాప్రతినిధులు కావాలనుకునే సామాన్యుల అధికారం కలను నిజం చేసిన పార్టీ దేశంలో టిఆర్‌ఎస్ ఒకటేనని ప్రశంసలు కురిపించారు. హూజూరాబాద్ ఎన్నికల్లో విద్యార్థినేత గెల్లు విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో మరో ఆర డజన్ విద్యార్థులు ప్రజానేతలుగా ఎదిగే అవకాశముందని విద్యార్థి సంఘాలు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News