Home రాష్ట్ర వార్తలు భూ గోల్‌మాల్‌పై ప్రజాకోర్టు

భూ గోల్‌మాల్‌పై ప్రజాకోర్టు

సిబిఐకి అప్పగించకపోతే ప్రజా న్యాయస్థానంలో విచారణ జరిపిస్తాం : కోదండరామ్

Kodan-ramహైదరాబాద్: ఒక్క గజం భూమి కూడా కబ్జా కాలేదని ప్రభుత్వం నిస్పిగ్గుగా అబద్ధాలు చెబుతుందని, కబ్జా చేసిన భూములను చూపిస్తామని స్థానికులు, మరి కొందరు చెబుతు న్నా పట్టించుకునే పరిస్థితులు లేవని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నా రు. భూముల కుంభకోణం కేసును సిబిఐకి అప్ప గించి నిష్పక్షపాత విచారణకు ప్రభుత్వం పూనుకో కుంటే, త్వరలో తామే నిపుణుల సహకారంతో ప్రజా కోర్టును (పీపుల్స్ ట్రిబ్యునల్) ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. పేదలు, జర్నలిస్టుల గృహాల నిర్మాణానికి దొరకని ప్రభుత్వ స్థలాలు, కొందరు వ్యక్తులకు మాత్రం కబ్జా చేసేందుకు ఎలా లభిస్తున్నాయని ప్రశ్నించారు.టిజెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శనివారం “మియాపూర్ భూకుంభకోణం” పై రౌండ్ టేబుల్ సమావే శాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి న్యాయవాదుల జెఎసి ప్రతినిధి గోపా ల్‌శర్మ అధ్యక్షత వహించగా న్యాయవాదులు, ఆర్‌టిఐ కార్యకర్తలు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఎస్.కె సిన్హా కమిటీ నివేదికను ఎక్కడ మాయ మైందని ప్రశ్నించారు. దీనిని వెంటనే బహిర్గతం చేయాలని, అక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ప్రభుత్వ భూమి లెక్కలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

సిబిఐ విచారణకు ఆదేశించకుంటే తామే ప్రజా కోర్టు నిర్వహించి ప్రజల వాంగ్మూలాన్ని, పలువురు సేకరించిన డాక్యూ మెంట్లను స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడాని కి గల కారణాలను గుర్తించి, బాధ్యులపై న్యాయ, చట్టపరంగా తీసుకునే చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చెందా ల్సిన జాగీ ర్దార్ భూములను కొందరు రకరకాల డాక్యూమెంట్లను సృష్టించి, సివిల్ సూట్లు వేసి, ప్రభుత్వయంత్రాంగం సహకారంతో తమ పేర్లపై డాక్యుమెం ట్లను రాయించుకున్నారని వివరిం చారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వీలుందన్నారు. పుప్పల్‌గూడలోని ప్రభుత్వ భూమిని ధర్మపురి క్షేత్రం దేవుని పేరుతో కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారన్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అనే బ్యాంకులు కొందరు వ్యక్తులకు మాత్రం కబ్జా చేసిన భూములకు, నిత్యం మార్పిడి జరిగే భూములకు మాత్రం రుణా లు ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను జాగ్రత్తగా కాపాడాలన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఆధునిక పద్ధతిని ఉపయోగించి భూ రికార్డులను భద్రపర్చాలన్నారు. ప్రభుత్వ భూముల ను ప్రజల సమిష్టి ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు.
సీనియర్ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ జాగిర్దార్ అంటేనే రాజ్యంలో ఒక రాజ్యమని, భూములతో పాటు ఊరు,ప్రజలపైన సర్వఅధికా రం ఉండేదన్నారు.

జాగీర్‌దార్ స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా బదిలీ అయ్యాయ న్నారు. సియాసత్ ఉర్ధూ దిన పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జాహేద్‌అలీఖాన్ మాట్లాడుతూ వ్యవసాయం, అటవీ తదితర భూములు ప్రైవే టుపరం అవుతు న్నాయన్నారు. ప్రభుత్వ భూములు పేదలకు ఉపయోగ పడాలన్నారు. సీని యర్ న్యాయ వాది కె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయాలన్నారు. ఈ విషయంలో ప్రజాకోర్టు నిర్వహించి నివేదికను సమర్పిస్తే అప్పుడు ప్రభుత్వ నీతి స్పష్టమైతుందన్నారు.
ఆర్‌టిఐ కార్యకర్త సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు కబ్జా జరిగినట్లు ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇందులో సూత్రధారులను బహిర్గతం చేస్తామన్నారు. ప్రభుత్వం కబ్జాదారులను కాపాడేందుకు పనిచేస్తుందన్నారు. “మన తెలంగాణ”లో ప్రచురితమైన కారు కథను ఉటంకిస్తూ భూ కుంభకోణం కేసులో ఒక పత్రిక యజమని పేరుతో కథనాలు వచ్చినా ప్రభుత్వం స్పందింకపోవడం అన్యాయ మన్నారు. మియాపూర్ స్థానికులు శోభన్ మాట్లాడుతూ సర్వే నెం 100, 101లో పేదలు గుడిసెలు వేస్తే తమను అరెస్ట్ చేశారని, అదే అపార్ట్‌మెంట్లను నిర్మిస్తే వారికి మద్దతునిస్తున్నారని విమర్శించారు.ప్రొఫెసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాలో మంత్రుల ప్రమేయం కూడా ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది చంద్రశేఖర్ , జెఎసి ప్రతినిధులు బైరి రమేష్, బి.ఎన్.రెడ్డి,మాదు సత్యంగౌడ్, చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.