Home కుమ్రం భీం ఆసిఫాబాద్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

 

mike

*తరగతిగదులలోనే దేశ, రాష్ట్ర భవిష్యత్
*విద్యయే ఒక ఆయుధం
*రూ. 13 కోట్లతో నిర్మించిన రెసిడెన్సియల్ పాఠశాల భవనం
*రాష్ట్ర మంత్రి జోగురామన్న

మన తెలంగాణ/ఆసిఫాబాద్: కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం  జిల్లా కేంద్రంలోని రూ. 13 కోట్లతో సాంఘీక  సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. మొదట పాఠశాల భవనం అనంతరం వసతిగృహం , డార్మెంటరి గదులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అందుకుని విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్‌కు చాలా అభిమానం ఉందన్నారు. అన్ని  వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో 543 రెసిడెన్సియల్ పాఠశాలను ప్రారంభించారన్నారు. నిరుపేద విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ప్రభుత్వం నుండి రూ. 20లక్షలు మంజూరు చేస్తామన్నారు. మనదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్సియల్  పాఠశాలలను ఏర్పాటు చేసి అందులో సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, చదువు పేదరికారిని అడ్డం రాకుండా ఉండేందుకే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని వాంకిడి మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్  పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోవలక్ష్మిలు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్షం వల్ల తెలంగాణలోని వసతిగృహాలలో గతంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రెసిడెన్సియల్ పాఠశాలలకు, వసతిగృహాలకు నూతన భవనాలు ని ర్మించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు.

గత ప్రభుత్వాలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తు వారి జేములు నింపుకున్నారని కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టప డి చదవాలని, విద్య ద్వారానే ఆలోచన పెరుగుతుందని , సమాజం అభివృద్ధికి విద్య ఎంతగానో అవసరమన్నా రు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన లక్ష ప్రభుత్వ ఉ ద్యోగాలకు ఇప్పటికే 56వేల ఉద్యోగాలు భర్తి చేశామని ఇక 44వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీచేస్తామన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు, పా ఠశాలకు , జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడు తూ మారుమూల గిరిజన , పేద విద్యార్థుల కోసం ప్ర భుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దృష్టిసారించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్ర తిభను గుర్తించేది మొదట ఉపాధ్యాయులనే నని, వారి భవిష్యత్ మొదట ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంద ని, దానిని గుర్తుంచుకుని విద్యార్థులకు విద్యనందించాలన్నారు. చదువు ఒక ఉద్యోగం కోసమే కాకుండా స మాజ అభివృద్ధి కోసం చదవాలని, చదువుకున్న విద్యార్థులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, అటువంటి స మయంలో ఆందోళన కు గురికాకుండా ప్రైవేటు సెక్టార్‌లలో ఉద్యోగం సాధించి అభివృద్ధి చెందాలన్నారు. ప్ర తీ గ్రామం నుండి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్ర భుత్వ పాఠశాలలకు వచ్చేలా ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ సహా క కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు, మార్కెట్ కమిటి చై ర్మన్ గంధం శ్రీనివాస్, ఎంపిపి తారాబాయి, పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ హైమద్, గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, ఆర్డివో సురేష్, తదితరులు పాల్గొన్నారు.