Wednesday, March 22, 2023

నేడు పల్స్ పోలియో

- Advertisement -

Pulse-Polio

  • 5 ఏళ్ల లోపు ప్రతి పిల్లలకి పల్స్ పోలియో
  • సిద్ధంగా 55 లక్షల వాక్సినేషన్ డోసులు

హైదరాబాద్ : పోలియో రహిత సమాజ సుస్థిరతకు ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌పోలియోకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశాషన్ నగర్ లో ఉదయం 9.00 గంటలకు పిల్లలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ పోలియో చుక్కలు వేసి ప్రారంభిస్తారు. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులు వారి వారి సొంత నియోజకవర్గాలు, ప్రాంతాల్లో 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు.రాష్ర్ట వ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలను వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం 22,768 పోలియో కేంద్రాల ద్వారా 95,500 సిబ్బంది పోలియో చుక్కలను వేయడానికి పనిచేయనున్నారు. ప్రయాణాల్లో ఉన్న వారి కోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్‌లలో మరియు ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేయడమైనది. 787 మొబైల్ టీం, 2,280 రూట్ సూపర్‌వైజర్స్, 8,711 మంది ఎఎన్ఎంలు, 27,045 ఆశా వర్కర్లు, 32,082 అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. కాగా 55 లక్షల వ్యాక్సినేషన్ డోస్‌లు వేయడానికి సంసిద్ధం చేయడానికి సిద్దం చేశారు. మార్చి 11న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమం ఉండనుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, స్కూల్ ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతోంది.

Pulse polio day is 28 January
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News