Thursday, April 25, 2024

అదరగొడుతున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

Kings XI Punjab knockout chance in IPL 2020

దుబాయి: వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆరంభంలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడిన పంజాబ్ ప్రస్తుతం మాత్రం వరుస విజయాలతో అదరగొడుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది.

ముంబై, ఢిల్లీ వంటి బలమైన జట్లను ఓడించడం ద్వారా పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చేరికతో జట్టు బలంగా మారింది. అంచనాలకు తగినట్టుగానే గేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. ఇక మాక్స్‌వెల్ కూడా ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా తయారైంది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. మయాంక్ కూడా జోరుమీదున్నాడు. బౌలింగ్‌లో కూడా పంజాబ్ మెరుగ్గా కనిపిస్తోంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిస్తే పంజాబ్ నాకౌట్‌కు చేరుకుంటుంది.

Kings XI Punjab knockout chance in IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News