Friday, April 26, 2024

అమిత్‌షాతో పంజాబ్ సిఎం భేటీ

- Advertisement -
- Advertisement -

Punjab CM Amarinder Singh meets Amit Shah

ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి, రైతులకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్నప్రతిష్టంభనను వీలయినంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని, ఎందుంటే రైతు ఆందోళన పంజాబ్ ఆర్థిక వ్యవస్థతో పాటుగా దేశ భద్రతపైనా ప్రభావం చూపుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గురువారం విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాను ఆయన నివాసంలో కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో ఇరుపక్షాలు కూడా మొండి వైఖరి అవలంబించరాదని, త్వరగా దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు. ‘ఈ సమస్యపై మా వైఖరిని స్పష్టం చేయడానికి, వీలయినంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని హోంమంత్రిని రైతులను కోరడం కోసం నేను ఆయనను కలవడం కోసం వచ్చాను. ఎందుకంటే ఆందోళన పంజాబ్ ఆర్థిక వ్యవస్థతో పాటుగా భద్రతపైనా ప్రభావం చూపిస్తోంది’ అని అమరీందర్ అన్నారు.

ఈ సమస్యకు వీలయినంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని తాను హోంమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అడగ్గా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సమస్యను పరిష్కరించుకోవలసింది వారే. మేము పంజాబ్ వైఖరిని మరోసారి స్పష్టం చేశాం’ అని అమరీందర్ చెప్పారు. విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య చర్చ జరుగుతున్న సమయంలోనే అమరీందర్ సింగ్, అమిత్‌షాల సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపారు. వాస్తవానికి గురువారం ఉదయం ఈ సమావేశం జరగాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యమైందని, దాదాపుగా మధ్యాహ్నం సమయంలో జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ముఖ్యమంత్రి అయిన అమరీందర్ సింగ్‌లు రైతుల ఆందోళనను సమర్థిస్తూ ఉండడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నీరుగార్చే లక్షంతో అసెంబ్లీలో రెండు చట్టాలను ఆమోదించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News