Friday, March 29, 2024

గోవును కాపాడ్డంలో సాయపడ్డ పంజాబ్ సిఎం

- Advertisement -
- Advertisement -

Channi saves cow

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆవుకు సాయపడిని వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది. ఆయన ఇంటికి వెళుతున్నప్పుడు రోడ్డుపై జనం గుమ్మికూడి ఉండడం చూశారు. దగ్గరికెళ్లి చూస్తే విషయం ఆయనకు అర్థమైంది. ఇరుకైన లోతైన గుంతలో ఓ ఆవు పడిపోయింది. దాన్ని ఎలా పైకి తేవాలా అన్ని అక్కడి ప్రజలు తర్జనభర్జనలు చేసుకుంటూ ఆలోచిస్తున్నారు. అదే సమయంలో చన్నీ అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా ఆ మూగజీవికి సాయపడ్డారు. గుంతలో నుంచి ఎలా పైకి తేవాలా అని వారితో చర్చించారు.చివరికి ఆ ఆవును గుంత నుంచి బయటికి తేవడానికి చాలా సమయమే పట్టింది. కాగా ఆ టాస్క్ పూర్తయ్యే వరకు పంజాబ్ ముఖ్యమంత్రి అక్కడి నుంచి కదలనేలేదు. ఆవును పైకి చాలా మంది లాగుతున్నప్పుడు ఆయన టార్చీని పట్టుకుని వెలుగుచూపారు. అందరూ కలిసి ప్రయత్నించిన తర్వాత ఆ ఆవు సురక్షితంగా గుంత నుండి బయటపడింది. ఆయన ‘చంగా మస్సీ, ధ్యాన్ రఖీ’ అని తెలిపారు. పంజాబీలో అలా అంటే ‘నీవు రక్షించబడ్డావు’ అని అర్థమట. కాగా ఆవును ఆయన ‘మస్సీ’ అన్నారు. అంటే మాత అని పిలిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలతో ఆయన మాటామంతీ జరిపి వారి యోగక్షేమాలు కనుకున్నారు. అప్పుడు ఒకతను వచ్చి తాను నిరుద్యోగిగా ఉన్నానని ఆయన తెలుపగా, ‘వచ్చి నన్ను కలువు. నీకు తగిన ఉద్యోగాన్ని చూస్తాము’ అని హామీ కూడా ఇచ్చారు. అది కూడా వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News