Thursday, April 25, 2024

పంజాబ్‌లో అవినీతి మంత్రిపై వేటు

- Advertisement -
- Advertisement -

ఆరోగ్యశాఖలో కొనుగోళ్లకు ఒక్కశాతం కమిషన్ డిమాండ్ చేసిన మంత్రి
సమాచారం తెలుసుకొని విచారణ జరిపించిన సిఎం భగవంత్‌మాన్
నిజమని రుజువు అయిన తరువాత మంత్రివర్గం నుంచి తొలగింపు

ఛండీగఢ్ : అవినీతి ఏ స్థాయిలో ఉన్న సహించబోమని ఇచ్చిన హామీని పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఏకంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాపై వేటువేసింది. అంతటితో ఆగకుండా ఆయనను అరెస్ట్ చేయించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సింగ్లాపై రెండు మాసాలకే ఆరోపణలు రావడం గమనార్హం. ఆయన శాఖలో వైద్య పరికరాలకు సంబంధించి కొనుగోళ్లు, టెండర్ల విషయంలో ఒక్క శాతం కమిషన్ ఇవ్వాలని విజయ్ సింగ్లా డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రహస్యంగా విచారణ జరిపించారు. సింగ్లా కూడా ఒప్పుకోవడంతో కేసు నమోదు చేయాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ విజయ్ సింగ్లాను అరెస్ట్ చేసింది. అనంతరం మాన్ మాట్లాడుతూ అవినీతి ఏంత స్థాయిదైనా కనికరించబోమన్నారు. కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశానని ముఖ్యమంత్రి తెలిపారు. ‘ఆరోగ్య శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు.

పాల్పడినట్టు అంగీకరించారు. కాంట్రాక్టుల విషయంలో ఒక్క పర్సెంట్ కమిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారన్నారు. పక్కా ఆధారాలు ఉన్నాయని, తన ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు’ సిఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆప్‌కు ఓటేశారని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు హితవుపలికారు. కేజ్రీవాల్ లాంటి కొడుకు, మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై యుద్ధం కొనసాగుతుందన్నారు. దంతవైద్యుడైన విజయ్ సింగ్లా గత ఎన్నికల్లో మన్సా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. స్వయంగా వైద్యుడు కావడం, సీనియర్ అయినందున మాన్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News