Wednesday, April 24, 2024

ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపు

- Advertisement -
- Advertisement -

Punjab Kings win against Rajasthan Royals

 

సంజూ శాంసన్ సెంచరీ వృథా n రాణించిన కెఎల్ రాహుల్, దీపక్ హుడా

వాంఖడే: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే జట్టు స్కోరు 22 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (14) చేతన్‌శర్మ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్‌గేల్ మొదటగా నెమ్మదిగా ఆడినట్లే కనిపించినా ఆ తర్వాత బౌండరీలు, సికర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ 67 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత దూకుడుమీదున్న క్రిస్ గేల్ (4౦) పరాగ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను తన భుజాన వేసుకున్నాడు.

ఈ క్రమంలోనే కేవలం 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌కు ఇది ఐపిఎల్‌లో 22వ అర్ధ సెంచరీ. మరోవైపు దీపక్ హుడా సైతం వరుస సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో రాజస్థాన్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వీరిద్దరూ బౌలర్లపై విరుచుకుపడడంతో కెప్టెన్ సంజూ శాంసన్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే దీపక్ హుడా (64) అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న కొద్దిసేపటికే క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. రాహుల్‌హుడా జోడి 105 పరుగుల విలువైన ఛేగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ (౦)ను సైతం మోరిస్ ఖాతా తెరవకుండానే పెవియన్‌కు పంపించాడు. మరోవైపు సెంచరీకి సమీపంలో ఉన్న కెప్టెన్ కెఎల్ రాహుల్ (91) చేతన్ సకారియా చివరి ఓవర్‌లో తివాతియా పట్టిన అద్భుత క్యాచ్‌తో నిరాశగా క్రీజును వదిలాడు. ఇక షారుఖ్ ఖాన్ (6, నాటౌట్)తో క్రీజులో ఉన్న చివరి బంతికి జై రిచర్డ్‌సన్ (0) డకౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 221 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్ 2, రియాన్ పరాగ్ ఒక వికెట్ తీశారు.

ఆదిలోనే ఎదురుదెబ్బ..

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బెన్ స్టోక్స్ (0) ఇన్నింగ్స్ మూడో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీ వేసిన మూడో బంతిని ఆడిన స్టోక్స్ అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. అనంతరం కొద్దిసేపటికే ఒక బౌండరీ, సిక్సర్ కొట్టి ఊపుమీద కనిపించిన మనన్ వొహ్రా (12) హర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్‌తో కెప్టెన్ సంజూ శాంసన్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచే బాధ్యత తీసుకున్నాడు. అయితే జట్టు స్కోరు 70 పరుగుల వద్ద జోస్ బట్లర్ (25), మరికొద్దిసేపటికే శివమ్ దూబే (23) సైతం పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు అప్పటివరకు జాగ్రత్తగా ఆడిన రియాన్ పరాగ్ (25) పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. ఆ తర్వాత రాహుల్ తెవాతియా (2) కూడా ఇలా వచ్చి అలా వెళ్లాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్..

ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం ఆచితూచి ఆడాడు. చెత్త బంతుల్ని వదిలేస్తూ, అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలించి 54 బం తుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఇదే తొలి సెంచరీ కాగా, కెప్టెన్‌గా సంజూకి కూడా ఇదే మొ దటిది. అయితే చివరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో ఆ ఖరు బంతికి 5 పరుగులు కావాల్సిన తరుణంలో కెప్టెన్ సంజూ శాంసన్ (119) అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ నాలుగు పరుగులతో విజయం సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News