Home జాతీయ వార్తలు వరి నాటేశాడని రైతుపై కేసు…

వరి నాటేశాడని రైతుపై కేసు…

Former

పంజాబ్: ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను అతిక్రమించినందుకు పంజాబ్ పోలీసులు ఓ రైతుపై కేసు నమోదు చేశారు. మోగా జిల్లాలో నీటి నిల్వల స్థాయి కొరత రావడంతో నీటిని ఆదా చేయడంలో భాగంగా జూన్ 20వరకు ఎవరూ పోలంలో నాట్లు వేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన సెఖన్ కలన్ గ్రామానికి చెందిన గుర్మీత్ సింగ్ అనే రైతు ముందే వరి నాట్లు వేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో  గుర్మీత్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతుపై కేసు నమోదు చేయడంతో జిల్లాలోని రైతులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం గుర్మీత్ సింగ్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.