Friday, March 29, 2024

స్వాతంత్ర్య దినోత్సవం నాడు పంజాబ్ లో 100 ’ఆమ్ ఆద్మీ క్లినిక్ లు‘ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

Bhagwant Mann

చండీగఢ్: పంజాబ్ లోని మాన్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం నాడు(15 ఆగస్టు)న 100 ఆమ్ ఆద్మీ క్లినిక్లు తెరచి ప్రజలకు అంకితం చేయనుంది.  ముందుగా 75 క్లినిక్ లు అనుకున్నప్పటికీ వాటిని 100కు పెంచడం జరిగిందని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జరమజ్రా తెలిపారు. సామాన్యులకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ’ఆజాదీ  కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్లినిక్కుల వల్ల దిగువ స్థాయి, మధ్యతరగతి వారికి చాలా మేలు జరుగుతుందని అన్నారు. గత నెల ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ విషయంపై మాట్లాడుతూ ‘‘ఆమ్ ఆద్మీ క్లినిక్ల లో డాక్టరు సహా  నలుగురైదుగురు సిబ్బంది  ఉంటారు. ప్రజలకు 100 రకాలు పరీక్షలు, ఔషధాలు ఉచితంగా అందించడం జరుగుతుంది’’ అన్నారు. రాష్ట్రంలోని  అందరికీ ఉచిత చికిత్స అందించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News