Friday, March 29, 2024

పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

Manpreet-Singh-Badal

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు పేర్కొంది. దీని వల్ల ఖజానాపై భారం తగ్గడంతో పాటు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలవుతుందని తెలిపింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీలను అమలు చేయడానికి బడ్జెట్ ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య, కౌలు రైతుల రుణమాఫీ, కూరగాయల రైతులకు మండీ ఫీజును 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గింపు వంటి ప్రధాన అంశాలను మంత్రి బడ్జెట్‌లో ప్రస్తావించారు.

Punjab to reduce govt employees retirement age
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News