Friday, March 29, 2024

సన్‌రైజర్స్ ‘ఔట్’

- Advertisement -
- Advertisement -

Punjab won the match against Sunrisers hyderabad

బౌలర్ల శ్రమ వృథా,
మళ్లీ ఓడిన హైదరాబాద్
పంజాబ్ అద్భుత విజయం

షార్జా: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారలేదు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. పంజాబ్ ఉంచిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక హైదరాబాద్ చతికిల పడింది. బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ ఈ సీజన్‌లో 8వ ఓటమిని చవిచూసింది. స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (2) మరోసారి విఫలమయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా నిరాశ పరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కూడా షమికే దక్కాయి. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కాస్త పోరాటం చేశాడు. ఇక మనీష్ పాండే (13), కేదార్ జాదవ్ (12), అబ్దుల్ సమద్ (12) జట్టును ఆదుకోలేక పోయారు. సాహా (31) పరుగులు చేసి రనౌటయ్యాడు. చివర్లో జేసన్ హోల్డర్ వరుస సిక్సర్లతో చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు అవకాశాలు చిగురించాయి.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ ఐదు సిక్సర్లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో హైదరాబాద్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచి పోయింది. షమి, రవి బిష్ణోయి, హర్‌ప్రీత్‌లు అద్భుత బౌలింగ్‌తో పంజాబ్‌కు విజయం సాధించి పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ బౌలర్లు రాణించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ (21), మార్‌క్రామ్ (27), హర్‌ప్రీత్ 18 (నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 19 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సందీప్, రషీద్ ఖాన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News