Home ఖమ్మం ఖ‌మ్మం మేయ‌ర్‌ గా పునుకొల్లు నీరజ

ఖ‌మ్మం మేయ‌ర్‌ గా పునుకొల్లు నీరజ

Punukollu Neeraja Elect As Khammam Mayorఖ‌మ్మం : ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను అధికార టిఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో పేర్ల‌ను ఖ‌రారు చేసినట్టు ఎన్నికల పరిశీలకులు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. పునుకొల్లు నీర‌జ 26వ డివిజ‌న్ నుంచి కార్పొరేటర్ గా  గెలుపొందారు. ఫాతిమా జోహ్రా 37వ డివిజ‌న్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు.  ఖ‌మ్మం మున్పిపల్ కార్పొరేష‌న్‌లో ఉన్న మొత్తం 60 డివిజన్లలో అధికార టిఆర్ఎస్ 45 డివిజ‌న్ల‌లో విజయం సాధించింది.  కాంగ్రెస్ 10, ఇత‌రులు 5 డివిజ‌న్ల‌లో గెలుపొందారు. బిజెపి ఒక డివిజ‌న్‌లో మాత్ర‌మే విజయం సాధించింది.