Home తాజా వార్తలు నేటి నుంచి గోల్డ్ బాండ్స్ షురూ

నేటి నుంచి గోల్డ్ బాండ్స్ షురూ

Purchase of Gold Bond 5th Series starts today

 

మార్కెట్ రేటు కంటే తక్కువకే కొనుగోలు చేసే అవకాశం

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గోల్డ్ బాండ్ ఐదో సిరీస్ కొనుగోలు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐదో దశ బంగారం బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ.5,334 గా ఆర్‌బిఐ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఆన్‌లైన్ పెట్టుబడిదారులకు, బంగారు బాండ్ల ఇష్యూ ధర గ్రాము రూ.5,284 ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2020-21 సిరీస్ -5కు సబ్‌స్క్రిప్షన్ పొందటానికి ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ సంవత్సరం బంగారం ధర 37 శాతం పెరిగి, బంగారం ధర 10 గ్రాములకు 54,000 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐదో దశ గోల్డ్ బాండ్స్ అందరినీ ఆకర్షిస్తోంది.

పథకం ముఖ్యాంశాలు..
1. బంగారు బాండ్ల జారీ తేదీ 2020 ఆగస్టు 11
2. భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బిఐ సావరిన్ బంగారు బాండ్లను జారీ చేస్తుంది.
3. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఐదు సిరీస్ బంగారు బాండ్లను జారీ చేయనున్నట్లు ఆర్‌బిఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది.
4. బంగారు బాండ్ల వ్యవధి ఎనిమిది సంవత్సరాలు. అయితే ఐదో సంవత్సరం తరువాత నిష్క్రమించే అవకాశం ఉంది.
5. బంగారు బాండ్ల అమ్మకం నేరుగా లేదా ఏజెంట్ల ద్వారా బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా జరుగుతుంది.
6. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో సగటు 99.9 నాణ్యమైన బంగారం ధరల ఆధారంగా ఇష్యూ ధర జారీ చేస్తారు.
7. ఏ వ్యక్తి అయినా కనీసం ఒక గ్రాముల బంగారు బాండ్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో, వ్యక్తిగత
8. పెట్టుబడిదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా నాలుగు కిలోల వరకు బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

గోల్డ్ బాండ్‌తో ప్రయోజనాలు..
మీరు పెట్టుబడి పరంగా బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నట్లయితే గోల్డ్ బాండ్లు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనికి కారణం మీరు భౌతిక బంగారం భద్రతా పరంగా ఆందోళన కల్గించేది. అయితే బంగారు బాండ్ల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు మీరు బంగారాన్ని లాకర్‌లో ఉంచినట్లయితే, దాని కోసం మీరు ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించాలి. బంగారు బాండ్ల విషయంలో అలాంటి సమస్య లేదు. మీరు ప్రతి సంవత్సరం బంగారు బాండ్లపై 2.50 శాతం వడ్డీని పొందుతారు. అదే సమయంలో మెచ్యూరిటీ సమయంలో ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Purchase of Gold Bond 5th Series starts today