*మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : మండలంలోని అడ గ్రామం వద్ద మిషన్ భగీరథ పనులను మంగళవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని మండలాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా మొదటగా అడ గ్రామం వద్ద ఫేస్-1 నిర్మించిన ఇంటెక్‌వెల్‌ను పరిశీలించి 115 ఎంఎల్‌డి 16వేల కిలో లీటర్ సామర్థం కల్గిన ఈ ఇన్‌టెక్‌వెల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని దీని ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి , రెబ్బెనతో పాటు సిర్పూర్(టి)లోని ఏడు మండలాలకు తాగునీరు అందుతుందన్నారు. వీటికి సంబంధించిన మొత్తం 14 సంపుల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ మండలాలకు మొత్తం 1176 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణంలో 1097 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మిగతా 82 కిలోమీటర్లు త్వరలో పూర్తవుతాయన్నారు. మోటర్ ఇన్‌స్టలేషన్ పనులను పర్యవేక్షించిన అనంతరం దనోర గ్రామం వద్ద నిర్మిస్తున్న 30 ఎంఎల్‌డి సామర్థం ఉన్న ప్లాంట్‌ను పర్యవేక్షించి ఈ ప్లాంట్ ద్వారా కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి మండలాలకు తాగునీరు అందుతుందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిలో భాగంగా మొత్తం 10 సంపుల నిర్మాణం పూర్తయిందని మొత్తం 368 కిలోమీటర్ల పైప్‌లైన్‌కి 289 కిలోమీటర్లు పూర్తయిందని మిగతా 78 కిలోమీటర్లు పూర్తకావల్సి ఉందన్నారు. మిగతా పనులను కూడా అదనంగా మిషన్‌లు తెప్పించి ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌డబ్లూఎస్ మిషన్ భగీరథ ఈఈ రమణ, ఎస్‌ఈ ప్రకాష్‌రావు, ఎల్‌అండ్‌టి క్లస్టర్ మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.