Home జిల్లాలు రెండ్రోజుల్లో పుష్కర పనులు పూర్తి చేయండి

రెండ్రోజుల్లో పుష్కర పనులు పూర్తి చేయండి

collcter-sri-deviకలెక్టర్ టి.కె.శ్రీదేవి

పెబ్బేరు: ఈ నెల 12 నుండి 24 వరకు నిర్వహించనున్న కష్ణా పుష్కరాల పనులను రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని రంగాపూర్ పుష్కరఘాట్‌ను కలెక్టర్‌తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ రంజీత్ ప్రసాద్, డిపిఒ వెంకటేశ్వర్లుతో పాటు వనపర్తి ఆర్డీఒ రాంచందర్‌లు పర్యవేక్షించారు. పనులు వేగవంతం కావాలని, పుష్కరాలకు ఎగువ భాగంలో కురుస్తున్న వర్షా లకు జూరాల నిండు కుండల ప్రవాహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టైన తర్వాత గోదావరి పుష్కరాలు జరిగినప్పటికీ అప్పట్లో నీటి ఇబ్బందులు ఉన్నాయని, కృష్ణా పుష్కరాలకు ప్రకృతి పరంగా వర్షాలు రావడంతో వైభ వం గా పుష్కరాల వేడుకలను జరుపుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వశాఖల సమన్వ యంతో పుష్కరాలను జరుపుకోవాలని, ఇప్పటికే వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించామన్నారు. మరో వారంరోజుల్లో పుష్కరాల వేడుకలు జరుపుకోను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పి జోగుల చెన్నయ్య, సింగిల్‌విండో చైర్మన్ గౌని కోదండరాంరెడ్డి, గుత్తేదారు బక్కచంద్రారెడ్డి, తహసీల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఇటిక్యాలరూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కృష్ణపుష్కరాల ఘాట్ల వద్ద పారిశుద్ద నిర్వహణ ప్రధానమని, సంబంధిత అధికారులు నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి.కె. శ్రీదేవి హెచ్చరించారు. అలాగే ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా రూపొందించాలన్నారు. శుక్రవారం బీచు పల్లిలో అధికారులకు పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు వారి విధి విధానాలతో పాటు బాధ్యతలపై క్షుణ్ణంగా వివరించారు. పుష్కరాలకు వచ్చే భక్తులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేవలం ఘాట్లలలో మాత్రమే స్నానం చేసే విధంగా వలంటీర్లు చూడాలన్నారు. అలాగే నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సేపు భక్తులు నీటిలో ఉండకుండా చూడాలన్నారు. భారీకేడ్లు, లేనిచోట భక్తులు స్నానం చేసేందుకు వెళ్తే అక్కడ కూడా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు భారీ కేడ్ల మధ్యనే స్నానం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు వచ్చి నప్పటీ నుంచి స్నానం చేసి దేవుడిని దర్శించుకుని చివరికి వెళ్లే వరకు మనదే బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఆర్డీఒ అబ్దుల్ హమీద్, డివిజన్‌లోని ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.