Thursday, March 28, 2024

‘పుష్ప’ నుంచి మరో మాస్ బీట్..

- Advertisement -
- Advertisement -

'Pushpa' 4th song releasing on Nov 19

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్, మూడు సింగిల్స్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది. తాజాగా నాలుగో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను చిత్రయూనిట్ వెల్లడించింది. ఈనెల 19న ఈ మాస్ బీట్ విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ బన్నీ మాస్ లుక్ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘Pushpa’ 4th song releasing on Nov 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News