Thursday, March 28, 2024

మారేడుపల్లి అడవుల్లో ‘పుష్ప’..

- Advertisement -
- Advertisement -

Pushpa Team to plan shoot at Marredpally Forest

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం ముందుగా కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితులు కనిపించకపోవడంతో ఇక్కడే చిత్రీకరణ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడానికి ‘పుష్ప’ టీమ్ సన్నాహకాలు చేసుకున్నారు.

ఈనెల మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ ఏరియాలో రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నారని సమాచారం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నెల రోజుల పాటు డీప్ ఫారెస్ట్‌లోనే షూటింగ్ చేయనున్నారు. దీని కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ సహా ఇతర తారాగణం, సిబ్బంది షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా రిసార్ట్‌లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అందులోనూ నక్సల్స్ ప్రభావిత అటవీ ప్రాంతం కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగనుందట. కాగా ఈ సినిమాలో పుష్ప రాజ్ అనే పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడు. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది.

Pushpa Team to plan shoot at Marredpally Forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News