Thursday, March 28, 2024

పుతిన్‌కు ఆంతరంగికులతోనే చావు తప్పదు

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన సన్నిహిత వర్గాలే చంపివేస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈయర్‌లో ఆయనే ప్రధాన భూమికలో ఉండగా ఇందులో పుతిన్ అంతం జరుగుతుందనే వ్యాఖ్యలు ఉన్నట్లు న్యూస్‌వీక్ తెలిపింది. రష్యాతో యుద్ధం ఆరంభం అయ్యి ఏడాది అయిన దశలో ఈ ఇయర్ డాక్యుమెంటరీని రూపొందించారు. రష్యా నేత తనను తాను బలవంతుడు అనుకుంటూ ఉండొచ్చు, అయితే ఎవరికైనా చేసే తప్పిదాలతోనే అశక్తత సంతరించుకుంటుంది. ఇప్పుడు ఆయన నాయకత్వానికి పేలవ దశ ఏర్పడింది. దీనితో విసిగివేసారే ఆయన ఆంతరంగిక వలయం నుంచే ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జెలెన్‌స్కీ ఈ ఫిల్మ్‌లో తెలిపారు. బలహీనుడయ్యే నేతను ఎవరూ రక్షించలేరు. ప్రత్యేకించి అంతర్గత వలయంలోనే ఉండే వారి నుంచి అటువంటి వారికి ప్రాణహాని ఉండనే ఉంటుందని తెలిపారు.

వేటకు దిగే వారిని వేటాడబడే ప్రాణి దెబ్బతీయకపోవచ్చు అయితే మరో వేటగాడు దగ్గరి నుంచే అంతమొందించవచ్చు. ఇది సహజ పరిణామమే, ఆలస్యంగా అయినా ఇటువంటిదే పుతిన్ విషయంలోనూ జరుగుతుందని జెలెన్‌స్కీ అంచనా వేశారు. చంపేవారికి చంపేందుకు అవసరం అయిన కారణం దొరికితే చాలు చంపేస్తారని వ్యాఖ్యానించారు. హంతకుడు అంతానికి గురి కాకమానడు. అది ఎప్పుడు అనేది కాలం తొందరగానే తేలుస్తుంది. ఎప్పుడైనా ఇది జరగవచ్చు అన్నారు. పుతిన్ అంతర్గత వలయంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని, పుతిన్ ఎవరిని నమ్మకుండా ఉండటం, చివరికి ఆయన చేసే అత్యంత కీలకపనులను కూడా సన్నిహితుల వద్ద కూడా వివరించకపోవడం వంటి వాటితో అంతర్గత బృందం రగిలిపోతోందని ఇటీవలే వాషింగ్టన్ పోస్టు ఓ కీలక వార్తను ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ తమ ఇయర్ డాక్యుమెంటరీలో పుతిన్ అంతం గురించి ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News