Home అంతర్జాతీయ వార్తలు 2036 వరకు ఫుతినే రష్యా అధ్యక్షుడు

2036 వరకు ఫుతినే రష్యా అధ్యక్షుడు

Putin Will Be President of Russia To 2036మాస్కో : 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ (68) కొనసాగనున్నారు. 2036 వరకు పుతిన్ మాత్రమే అధ్యక్షుడిగా ఉంటారన్న చట్టాన్ని రష్యా ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ క్రమంలో ఆయన మరో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగుతారు. పుతిన్ రష్యాకు రెండు దశాబ్ధాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పుతిన్ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుంది. అయితే అనంతరం వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన నిలబడుతారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ న్యాయ సమాచార పోర్టల్‌ ప్రకటన విడుదల చేసింది.