Thursday, March 28, 2024

చెట్లను పెంచే బాధ్యతలను కౌన్సిలర్లు తీసుకోవాలి: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

 

భద్రాద్రి: పల్లెప్రగతి స్ఫూర్తితోనే పట్టణ ప్రగతి నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నామన్నారు. చెత్త నిర్మూలనకు డంప్ యార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైంకుంఠధామాలు, పబ్లిక్ టాయ్‌లెట్లు నిర్మించాలన్నారు. జనాభాకు అనుగుణంగా వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్లను నిర్మించుకోవాలన్నారు. పట్టణాల్లో చెట్లను పెంచే బాధ్యతలను కౌన్సిలర్లు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికించే బాధ్యత కూడా కౌన్సిలర్లదేనని స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్ చట్టంతో ప్రజాప్రతినిధులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తప్పవని పువ్వాడ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోత్ కవిత, ఎంఎల్‌ఎ హరిప్రియనాయక్, వనమా వెంకటేశ్వర రావు, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మినారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కలెక్టర్ ఎంవి రెడ్డి పాల్గొన్నారు.

 

Puvvada ajay Kumar speech in Pattana Pragathi event
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News