Thursday, April 25, 2024

మొక్కను ఏడాది కాపాడితే… అది మనల్ని 50 ఏళ్లు రక్షిస్తుంది: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada plant tree at Sathupally

ఖమ్మం: ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటుతామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల ఆధాయంలో 10 శాతం నిధులు మొక్కల పెంపకానికి వినియోగించాలని సిఎం కెసిఆర్ చట్టం చేశారన్నారు. మైనింగ్‌తో వాతావరణ సమతుల్యత ఏర్పడిందన్నారు. అర్బన్ పార్క్, స్మృతి వనం వల్ల సత్తుపల్లి హరితవనంగా మారాలన్నారు. అడవులు తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, మొక్క నాటి సంవత్సరం కాపాడితే… అది మనల్ని 50 ఏళ్ల పాటు రక్షిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ లాంటి పట్టణాల్లో ఇప్పటికే ఆక్సీజన్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పల్లెల్లో కూడా ఆ దుస్తతి రాకూడదంటే మొక్కలు నాటాలని పువ్వాడ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News