Home తాజా వార్తలు తెలుగు రాష్ట్రాలకు సింధు విరాళం

తెలుగు రాష్ట్రాలకు సింధు విరాళం

PV-Sindhu

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నివారణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న సహాయక చర్యలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పి,వి.సింధు తనవంతు ఆర్థిక సహాయం అందించింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున సింధుల విరాళం ప్రకటించింది. కరోనా తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క రూ తమ సహాయ సహకారులు అందించాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కొంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారు పేదలకు చేయూత నిచ్చేందుకు ముందుకు రావాలని సూచించింది. ఇక, కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకుడని కోరింది.

PV Sindhu donates Rs 5 lakh each to Telangana And AP