Home తాజా వార్తలు చిత్రకారుడు వాసుకు రాకెట్ బహుకరించిన పివి సింధు

చిత్రకారుడు వాసుకు రాకెట్ బహుకరించిన పివి సింధు

PV Sindhu

 

మంచిర్యాల : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పివి సింధు మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస్కర్ల వాసుకు తాను వివిధ పోటీలలో ఉపయోగించిన రాకెట్‌ను బహుమతిగా అందజేసింది. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వాసుకు ఈరాకెట్‌ను అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన విజయాలను ఆకాంక్షిస్తూ తనలో ఉత్సహాన్ని నింపే విధంగా తన చాయచిత్రాన్ని చిత్రికరించి అందజేసిన వాసు అభిమానానికి కృతజ్ఞతగా రాకెట్‌ను అందజేస్తున్నానని అన్నారు. ప్రపంచ చాంపియన్ నుండి బహుమతి అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఈసందర్బంగా చిత్రకారుడు వాసు తెలిపారు.

PV Sindhu presented the rocket to painter Vasu