Home తాజా వార్తలు చరిత్ర సృష్టించిన పివి సింధు…

చరిత్ర సృష్టించిన పివి సింధు…

 

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2019 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై సింధు అద్భుత ఆటతో 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. 2017, 2018 ఫైనల్లో ఓటమిపాలైన సింధు, తాజాగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థికి చెమటలు పట్టించి ఛాంపియన్‌గా తన కలను నెరవేర్చుకుంది.

తొలి రౌండ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించిన సింధు… రెండో రెండో రౌండ్‌లోనూ అదరగొట్టింది. మొత్తంగా 38 నిమిషాల్లో ఈ గేమ్‌ను ముగించి టైటిల్ ను సొంతం చేసుకుంది.

PV Sindhu win World Championship 2019 Title