Home తాజా వార్తలు ఢిల్లీ రోడ్లు చూపించి బట్టల బజార్ సమస్యను పరిష్కరించారు

ఢిల్లీ రోడ్లు చూపించి బట్టల బజార్ సమస్యను పరిష్కరించారు

PV Wholesale clothes bazaar problem solved in delhi

 

పురస్కారాలకు అతీతమైన పివి
పివి జ్ఞాపకాలు రూపకాలు
రామశాస్త్రి గారితో బండారు రామ్మోహన రావు ఇంటర్వ్యూ

ఇరవై ఐదు సంవత్సరాల కిందటి మాట. అది వరంగల్ మహా నగరం. ఆ నగరానికి ఒకసారి నగర కమిషనర్ గా తరువాత జిల్లా కలెక్టర్ గా శాలిని మిశ్రా పని చేశారు. ఆమె కమిషనర్ గా పని చేసినప్పుడు ఆమెభర్త అజయ్ మిశ్రా జిల్లా కలెక్టర్ గా ఉండే వారు నగర కమిషనర్ పనిచేసినా జిల్లా కలెక్టర్ గా పనిచేసినా వరంగల్ జిల్లా వరంగల్ నగర అభివృద్ధి గురించి ఆలోచించి ఎన్నో కొత్త పథకాలను అమలు చేశారు నగర అభివృద్ధి గురించి ఆమె పూర్తిగా పట్టించుకున్నారు. రాజకీయ ఒత్తిడులకు లొంగని స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు ఉపయోగ కరమైన పనుల విషయంలో ఎప్పుడూ ప్రజలు రాజకీయ నాయకుల సలహాలు తీసుకొని వారి అభిప్రాయాలను ఆమె గౌరవించేవారు. అందుకే ఆమె దగ్గరికి ఎవరైనా పైరవీలకు వెళ్లాలంటే భయపడేవారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా తప్పుడు సిఫార్సు లు చేయడానికి వెనుకాడే వారు ఆమె జిల్లా కలెక్టర్ గా ఉండగా వరంగల్ నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా వరంగల్ బట్టల బజార్ లో చాలామంది తమ విలువైన స్థలాలను రోడ్డు విస్తరణ లో కోల్పోవాల్సి వచ్చింది.

అప్పుడు మన దేశ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా!‘ ఆయన కూడా ఎప్పుడు అదే మాట అనేవారు అలా వరంగల్ బట్టల బజార్ దుకాణాలు ఉన్న చాలా మంది వ్యాపారులకు పీవీ స్వయంగా తెలుసు పీవీ స్వయానా వరంగల్ వాసి హనుమకొండ ఎంపీగా కూడా చేశారు కనుక వారిని ఇంటి పేర్లతో సహా పిలిచేవారు పీవీకి తమకు మధ్య ఉన్న చొరవతో బట్టల బజార్ రోడ్డు విస్తరణ పనులను ఆయనతో కలెక్టర్‌కు చెప్పించి ఆపించాలని వారు అనుకున్నాను పివి గారికి దగ్గరగా తెలిసిన కొందరు బట్టల బజార్ వ్యాపారస్తులు. ఇదే పని మీద ఢిల్లీ వెళ్లి హోటల్ రూములో ఉన్నారు.మరునాడు ఉదయాన్నే ఆ వ్యాపారులు సరాసరి ఢిల్లీ లో పివి ఇంటికి వెళ్లారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే వారు తనను కలవడానికి ఎందుకు వస్తున్నారో పీవీకి తెలుసు. వాళ్ళు రాగానే పీవీ వారి యోగక్షేమాలు తెలుసుకొని మంచి మర్యాద మాట్లాడారు.

టి టిఫిన్ కాఫీలు కూడా ఆయన ఇంట్లో చేసారు తర్వాత ఇక ‘చల్లకు వచ్చి ముంత దాచినట్లు‘ ఎందుకని వారు అసలు విషయం చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు.వారు అలా తాము వచ్చిన పని చెప్పుకునే లోగా పివి తనకు కు తానే కల్పించుకొని వారి మాటల మద్యలో మాట దూర్చి ఢిల్లీ నగరం మొత్తం మీరు చూశారా అని వారిని అడిగారు కొందరు చూశామని ఎక్కువమంది పూర్తిగా చూడలేదని అన్నారు మీరు చూడని ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను ఒకసారి నగరమంతా తిరిగి రండి రాత్రి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు పీవీ తమకు ఇచ్చిన మర్యాదకు వ్యాపారస్తులు పొంగి పోయారు అంత పెద్దాయన అలా ఆఫర్ ఇస్తే పోక పోతే ఏం బాగుంటుంది అని తయారయ్యారు. పీవీ చేసిన ఏర్పాట్లతో ఆరోజు ఉదయం నుండి రాత్రి దాక ఢిల్లీ అంతా కలయ తిరిగి చూశారు రాత్రికి పీవీ ఇంట్లో భోజనం చేశారు.

అందరూ భోజనాల బల్ల దగ్గర కూర్చున్న తర్వాత పివి వచ్చారు భోజనం బాగుందా అని అడుగుతూనే ఢిల్లీ అంతా బాగా చూశారా అని మరో ప్రశ్న వేశారు చాలా బాగుంది అని వ్యాపారస్తులు రెండు ప్రశ్నలకూ కలిపి పీవీకి సమాధానం ఇచ్చారు మీకు ఢిల్లీలో ఏమి నచ్చింది అని పీవీ వారిని అడిగారు కొందరు పార్కులు విహారస్థలాలు నచ్చాయి అన్నారు మరికొందరు ఎర్రకోట పార్లమెంటు రాష్ట్రపతి భవనాలు నచ్చాయి అని చెప్పారు ఇవే కాకుండా ఇంకా ఏమి నచ్చాయి అని పీవీ రెట్టించి అడిగారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఢిల్లీలోని విశాలమైన రోడ్లు మంచి పచ్చిక మైదానాలు రోడ్డు పక్కన అందమైన చెట్లు పార్కులు నచ్చాయి అని చెప్పారు అంత పెద్దాయన అలా ఆప్యాయంగా అడుగుతుంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా మన వరంగల్ నగరాన్ని కూడా ఇలా ఢిల్లీ లా అందంగా తీర్చిదిద్దాలి సార్ అని మరికొందరు మరింత ఉత్సాహంగా పివిని అడిగారు. అదే నేను చెబుతున్నాను అన్నారు. పీవీ తాపీగా వరంగల్ నగరం కూడా అలా ఉండాలా వద్దా అని పీవీ వారిని ఎదురు ప్రశ్న వేశారు పీవీ తమను ఎక్కడ దెబ్బ కొట్టారో ఎక్కడ ఇరికించారో అప్పటికిగాని వారికి అర్థం కాలేదు అందరూ ఒకరినొకరు చూసుకొని తెల్ల ముఖాలు వేసుకున్నారు. తమ సమస్య చెప్పకుండానే పీవీ తమ ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం చూపించారు. వచ్చిన వారి నోటి ద్వారానే ఆ విషయం చెప్పించారు వారు వచ్చిన పని అయిపోయింది ఇంకా ఏమి అడుగుతారు.

ఖేల్ ఖతం దుకాణ్ బంద్.. కథ కంచికి మనం ఇంటికి…
ఈ అనుభవాన్ని అంతా ఢిల్లీ వెళ్ళిన బట్టల బజార్ వ్యాపారస్తులు వరంగల్ కి వచ్చిన తర్వాత రకరకాల కథనాలతో వ్యాఖ్యానాలతో ఒకరికొకరు చెప్పుకున్నారని చెబుతారు. ఈ విషయంలో పివి గారిని ఆయన తీరు అంతే అని ఇంకొందరు నిష్టూరంగా మాట్లాడారు. తిట్టుకునే వారు తిట్టుకున్నారు. మెచ్చుకునేవారు మెచ్చుకున్నారు అలా ఈ విషయం బహుళ ప్రచారంలోకి వచ్చింది.వెనకటికి మహాత్మా గాంధీ కూడా తనను కలవడానికి వచ్చే వారి విషయంలో వారు ఎందుకు వస్తున్నారో ముందే తెలుసుకునే వారని కాళోజీ నారాయణ రావు ఒక సందర్భంలో చెబుతారు. స్వాతంత్రానికి పూర్వం ఒకసారి మునగాల సంస్థానం నుండి గాంధీజీ తన వద్దకు వచ్చిన వారి సమస్యలను ముందుగానే పసిగట్టి అక్కడికక్కడే వారిని ప్రత్యక్షంగా మందలించి తర్వాత తను వారికి పరోక్షంగా చేయాల్సిన సహాయం చేశారని చెబుతారు. రాజకీయ చతురత అంటే అదే. ఎదుటి వారు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు. వారు తనను ఏమి అడుగుతారు వారికి ఎలా సమాధానం చెప్పాలి అనే విషయంలో పీవీ ఆయనకు ఆయనే సాటి అనే విషయం ఈ సంఘటన రుజువు చేస్తోంది కదూ!!!

అందుకే ఆయన దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా వ్యవహరించారు తాను అనుకున్న దాని విషయంలో పట్టు విడువలేదు. తనకు కాని దాని కోసం వెంపర్లాడ లేదు అవకాశం వచ్చిన ప్రతిసారి తానేమిటో నిరూపించుకున్నాడు మెచ్చుకుంటే పొంగిపోలేదు తిడితే కుంగిపోలేదు అందుకే పీవీ అందరివాడు అలాగే అందరికీ కాని వాడు కూడా అందుకే ఎలాంటి పురస్కారాలకు నోచుకోలేదు కానీ తన మిత్రులకే కాదు శత్రువులకూ మర్చిపోదామన్నా మరపురాని మరచిపోని జ్ఞాపకం మన పివి.

                                                                                                – బండారు రామ్మోహనరావు

PV Wholesale clothes bazaar problem solved in delhi