Home కరీంనగర్ తుమ్మనపల్లిలో కొండ చిలువ హల్‌చల్..

తుమ్మనపల్లిలో కొండ చిలువ హల్‌చల్..

python

 

కరీంనగర్ : హుజూరాబాద్‌ మండలంలోని తుమ్మనపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఓ కొండ చిలువ హల్‌చల్ చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ర హంసరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గత కొంతకాలంగా కొండ చిలువ సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అటుగా వెళ్తున్న రైతులకు వ్యవసాయ క్షేత్రంలో కొండ చిలువ తారస పడటంతో వెంటనే అటవీశాఖాదికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కొండ చిలువను బందించారు. ఈ సందర్భంగా పారెస్ట్ రెంజ్ అధికారి ముంతాజ్ ఆలీ మాట్లాడుతూ వన్య ప్రాణులను దాడి చేసి గాయపరచరాదని, వన్య ప్రాణులు సంచరిస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి రమేష్, బీట్ అధికారి రంజిత, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

python on a Farm