Home మంచిర్యాల రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం

రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం

road

*అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లు
*రోడ్ల నిర్మాణంలో అధికారుల చేతి వాటం
*ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు
*గడువు ముగిసినా పూర్తి కాని పనులు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : గ్రామీణ ప్రాంతా ల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు రోడ్లను మెరుగు పర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అయితే రోడ్ల పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాసిరకంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. గడువు ముగిసినప్పటికీ అధికారులు పనులు పూర్తి చేయలేదు. నిబంధనలకు ఎగనామం పెట్టి ప నులు నాసిరకంగా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక వైపు రోడ్ల నిర్మాణ పనులు జరుగుతుండగానే మరో వైపు గుంతలు పడుతున్నాయి. గ్రామీణ రహదారులు కంకర తేలి ప్రయాణికులను వెక్కిరిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద రోడ్ల నిర్మాణాలకు రూ. 216 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 509 రోడ్లు నిర్మించాల్సి ఉండగా 421 పనులను ప్రారంభించగా, ఒక్క రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మరో 8 రోడ్ల పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. గత మార్చిలోగా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండగా అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు వారి అనుచరులకే పనులను అప్పగించడం వలన అధికారులు సైతం గట్టిగా మందలించకపో తున్నారు. మంచిర్యాలలో 27 రోడ్లకు గాను రూ. 87.95 లక్షలు మంజూరు కాగా 21 రోడ్ల పనులను ప్రారంభించారు. అదే విధంగా లక్షెట్టిపేటలో 59 రోడ్లు మంజూరు కాగా 58 రోడ్ల పనులు చేపట్టారు. దండేపల్లిలో 44గాను 41, చెన్నూర్‌లో 51గాను 40, మందమర్రిలో 29 గాను 28, జైపూర్ 38గాను 35 రోడ్లు, కోటపల్లిల్లో 54 గాను 43, బెల్లంపల్లిలో 32 గాను 28, నెన్నెల 31 గాను 31, వేమనపల్లి 25గాను 25,తాండూర్‌లో 29గాను 16, భీమిని 24 గాను 22, కాసిపేట 19 గాను 19, జన్నారం 47 గాను 14 రో డ్లను ప్రారంభించారు. మొత్తం 509 రోడ్లకు గాను 421 రో డ్ల పనులు ప్రారంభించగా మరో 88 రోడ్లు చేపట్టలేదు.  హాజీపూర్, మండలంలోని గుడిపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో రూ. 2.65 లక్షలు వె చ్చించి ఇటీవలనే రో డ్డు నిర్మాణం చేపట్టగా పనులు నాషిరకంగా ఉన్నాయని గ్రామస్థులు ఆరోపించారు. అదే విధంగా చెన్నూర్ మండలంలోని చింతపల్లి గ్రామంలో రో డ్డు పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరో పించారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రధాన రహదారితో పాటు గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్షం వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. అధికారుల పర్యవేక్షణ కొరవడం వలన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పనుల్లో జాప్యం జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రో డ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.