Friday, March 29, 2024

క్వారంటైన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య…. కానీ కరోనా నెగిటివ్

- Advertisement -
- Advertisement -

 

 

లక్నో: క్వారంటైన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు అతడికి కరోనా టెస్టు నెగిటివ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌కు చెందిన ఓం ప్రకాశ్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓం ప్రకాశ్ యుపిలోని తుండ్ల రైల్వే స్టేషన్‌లో జాబ్ చేస్తున్నాడు. ప్రకాశ్‌తో పని చేసి సెక్షన్ ఇంజనీర్‌కు కరోనా సోకడంతో ఏడుగురు రైల్వే సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించారు. ప్రకాశ్‌ను ఏప్రిల్ 20, 23, 28న మూడు సార్లు కరోనా టెస్టు చేశారు. క్వారంటైన్‌కు వచ్చి ఎనిమిది రోజులైనా వ్యాధి నిర్ధారించకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడని తోటి సిబ్బంది తెలిపారు. బుధవారం తెల్లవారుజామున క్వారంటైన్‌ లో ఉంటున్న గదిలోనే ఉరేసుకున్నాడు. తోటి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశ్ బెడ్ కింద రూ.64 వేలు, పర్స్‌లో నాలుగు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. స్థానికులను తమతో పాటు క్వారంటైన్‌లో ఉంచారని ఉద్యోగులు ఆరోఫణలు చేస్తున్నారు. ఈ క్వారంటైన్ లో సరైన వసతులు, సదుపాయం లేదని రైల్వే ఉద్యోగులు తెలిపారు. తుండ్లా క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులకు మంచి వసతులు కల్పించామని స్థానిక పోలీస్ అధికారి సతీష్ గణేష్ వెల్లడించారు.

 

Quarantined railway employee commit suicide in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News