Saturday, April 20, 2024

ఈ ఆర్‌ఐ మామూలోడు కాదు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహం

ఇంటికి రూ.3లక్షల చొప్పున వసూలు

సస్పెండ్ చేసిన మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టర్

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారే వాటిని అన్యాక్రాంతానికి పాల్పడ్డాడు. లక్షలు రూపాయాలను లంచంగా తీసుకుని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు. ఈ అవినీతి అధికారి అక్రమాలపై పలువురు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి బాగోతాలపై విచారణ చేపట్టిన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సదరు అధికారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా పరమేశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. గాజుల రామారం పరిధిలోని దేవేందర్ నగర్, కైసర్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకు ని అక్రమంగా గదులను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాలోని ప్రభుత్వ భూ ములను ఆక్రమించుకుని ప్లాట్లుగా చేసి అందులో 2500లకు పైగా ఇళ్లను నిర్మించారు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా వీటిని అరి కట్టాల్సిన పరమేశ్వర్‌రెడ్డి కబ్జాదారులకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తూ వారిని గదికి రూ.3 లక్షల చొప్పున వసూళ్లకు తెగబడ్డారు. ఇం దులో తన వాటగా రూ.1.50 లక్షల పెట్టుకుని మిగిలిన రూ.1.50లక్షల చొప్పున మిగితా సిబ్బందికి వాటాలను చెల్లిస్తు వస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. విచారణలో ఈ అవినీతి అధికారి పరమేశ్వర్‌రెడ్డి బట్టబయలు కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గురువారం అతని విధులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అదేశాలను జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News