Home తాజా వార్తలు ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

R Krishnaiah supports field assistants protest

 

హిమాయత్‌నగర్: గ్రామీణ ఉపాధి పథకం కింద పని చేసే 7710 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్, బిసి నిరుద్యోగ జెఎసి సంయుక్తా ఆధ్వర్యంలో 33 జిల్లాల నుండి వచ్చిన వందలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడించి కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం రాజీపడి భేషరుతుగా సమ్మె విరిమించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం న్యాయం రాజధర్మమన్నారు.

ఉద్యోగులు సమ్మెచేయడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య బద్ధమైన హక్కు అని, ఉద్యమాలు చేస్తున్న ప్రతి వారిని అణచివేస్తామనే ధోరణి సరికాదన్నారు. ఉపాధి హమిలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఎఫ్‌టిఈలుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం ఉన్న ఎఫ్‌ఎ, హెచ్‌ఆర్ పాలసీని సవరించి హెల్త్ కార్డులు, ఇఎఫ్,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాదవశత్తు మరణించిన ఫిల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై స్పందించిన కమీషనర్ పదిరోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని హమి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ముట్టడిలోజెఎసి చైర్మన్ నీలా వెంకటేశ్,చంటి ముదిరాజ్,అసోసియేషన్ రాష్ట్ర కమిటి అధ్యక్షులు మేకల రవి,నాయకులు యాదయ్య, సిద్ధిరాములు, ఎమ్మార్పీఎస్, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

R Krishnaiah supports field assistants protest