Home చిన్న సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘రాగల 24 గంటల్లో’

ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘రాగల 24 గంటల్లో’

Raagala-24

హైదరాబాద్: శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బా తారాగణంలో వస్తోన్న సిన్మా ‘రాగల 24 గంటల్లో’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు విడుదల చేశారు. ”నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేనంటూ ఈషాతో సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ఓ హత్య సంఘటనపై విచారణ జరుగుతుండగా.. నా భర్తను నేనే చంపేశానంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ట్రైలర్ ఉత్కంఠతను రేపుతోంది. రఘుకుంచె సంగీత అందిస్తున్న ఈ సిన్మాలో ముస్కాన్ సేతి, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Raagala 24 Gantallo Theatrical Trailer