Thursday, March 28, 2024

‘ఎవరో వీరెవరో…’ పాటలో కథ ఉంటుంది

- Advertisement -
- Advertisement -

Radhe shyam songs in telugu

పాటల రచయిత కృష్ణకాంత్ (కె.కె.) చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో 200 సినిమాలలో 400 పాటలకు పైగా రాయడం విశేషం. ఇప్పుడు ఆయన కెరీర్ భారీ సినిమా స్థాయికి చేరింది. తాజాగా ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి కెకె పాటలు రాయడం విశేషం. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తుండగా హిందీ వర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర గేయ రచయిత కృష్ణ కాంత్ (కె.కె) మీడియాతో మాట్లాడుతూ “2009లో నా ఫ్రెండ్ శ్రవణ్ భరద్వాజ్‌తో (ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్) కలసి ‘కలయో నిజమో’ ఆల్బ మ్ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆతర్వాత హనురాఘవ పూడి ఇచ్చిన ట్యూన్‌కు పాట రాస్తే ‘అందాల రాక్షసి’లో రెండు పాట లు రాసే అవకాశము ఇవ్వ డం జరిగింది. ఆ పాటలు పెద్ద హిట్ అయి ఎంతోమంది ఫోన్స్ లలో రింగ్ టోన్స్‌గా మారాయి. ఇక ‘రాధే శ్యామ్’ దర్శకుడితో నా జర్నీ జిల్ సినిమా నుండి సాగుతోంది. ఇక ‘రాధేశ్యామ్’ చిత్ర దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ దగ్గరుండి నాతో పాటలు రాయించుకున్నారు. నేను రాసిన తరువాత దర్శక నిర్మాతలు ఈ ట్యూన్‌కు ఈ లిరిక్ బాగా లేదంటే మార్పులు చేసి మళ్లీ మళ్లీ రాయడం జరిగింది.

ఇలా వారందరూ పాటలు బాగా వచ్చే వరకు రాయించు కోవడం వల్లే ఈ రోజు ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇక ‘ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా’ పాటలో కథ ఉంటుంది. ఎక్కువ కథను సీన్స్‌లో చెప్పకుండా ఒక పాటలో మాంటేజ్ లాగా చూపిద్దామని ఈ పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాట వింటుంటే అందరికీ అర్థం కాదు. విజువల్‌గా చూస్తే ఎందుకు ఇలా రాశామో అనేది అర్థమవుతుంది. ఈ పాట విని లిరిక్స్ బాగున్నాయని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇక 1970లో యూరప్‌లో జరిగే లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్‌గా ఉన్న ప్రభాస్ ఇప్పడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అలాంటి వ్యక్తి సినిమాకు పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఐదుపాటలు రాశాను. అలాగే నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో 4 పాటలు రాశాను. మేజర్, హిట్ 2, నాగార్జున మూవీ ‘ఘోస్ట్’…ఇలా చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News