Home ఆఫ్ బీట్ సెల్‌ఫోన్‌తో రేడియేషన్ ముప్పు

సెల్‌ఫోన్‌తో రేడియేషన్ ముప్పు

చిన్నారుల్లోనే అధికమవుతోన్న సమస్య
ఇటీవల డబ్లూహెచ్‌ఒ హెచ్చరిక

Radiation

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రస్తుత బిజిలైఫ్‌లో సెల్‌ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ విపరీత వాడకం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారుల్లో రేడియేషన్ సమ స్య అధికమవుతోంది. రాత్రి,పగళ్లు సెల్‌ఫోన్‌లో పాటలువినడం, ఆటలు ఆడటం ఇలా రోజం తా చిన్నారులు ఫోన్‌లతోనే కాలాన్ని గడుపుతున్నారు. పిల్లల ఆనందంకోసం పెద్దలు కూడా వా రికి ఫోన్‌లను ఇస్తున్నారు. కానీ పిల్లలకు ఎట్టిపరిస్థితితుల్లోనూ సెల్‌ఫోన్ ఇవ్వొద్దని ప్రపంచ ఆ రోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) హెచ్చరిస్తుంది. పిల్లల మెదడు కణాల అభివృద్ధికి సెల్‌ఫోన్ వాడ కం హాని చేస్తుందని, సెల్‌ఫోన్లు,సెల్‌టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్‌తో అనేక అనారోగ్యసమస్య లు తలెత్తుతున్నాయని ప్రకటించింది. సెల్‌ఫోన్లు,సెల్‌టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ముప్పు త ప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని వైద్యులు అంటున్నారు. చిన్నారులకు సెల్‌ఫోన్‌లను ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే సిమ్ తీసేసి ఇస్తే మంచిందని వైద్యనిపుణులు అం టున్నారు.

పిల్లల్లో బ్రెయిన్‌ట్యూమర్ వస్తుందా

సెల్‌ఫోన్ వాడకం వల్ల పెద్దల్లో మెదడు సంబంధింత వ్యాధులు అతి తక్కువ శాతంలో వస్తాయ ని పలు పరిశోధనలు,అధ్యయనాల వల్ల తెలిసింది. కానీ ఇదే చిన్నారుల విషయానికొస్తే ఎక్కువసేపు సెల్‌ఫోన్‌లో మాట్లడటం, వాడటం వల్ల పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కంటిచూపుపై తీవ్ర ప్రభావం

స్మార్ట్‌ఫోన్ ఎక్కువ వాడకంతో వచ్చే కంటిచూపు కూడా దెబ్బతింటుందని వైద్యులు అంటున్నా రు. కంటిలోని రెటీనా సామర్థాన్ని స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే నీలికాంతి(బ్లూలైట్) దెబ్బతీస్తుంది. దీంతో మయోపియా(దగ్గర దృష్టి) పెరిగిపోతుందని చెబుతున్నారు. రోజుకు రెండు గంటలపాటు స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నా రు. స్మార్ట్‌ఫోన్ విడుదల చేసే బ్లూ వయలెట్ కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై హాని కారక ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో రెటీనా కేంద్రక భాగంలోని మాక్యులా క్షీణత మొదలవుతుంది. దీంతో కంటిచూపు క్రమంగా క్షీణించడం మొదలవుతుందని, దీంతో శాశ్వతంగా సెం ట్రల్ విజన్ కోల్పొవాల్సి వస్తుందని అంటున్నారు.

హాని లేకుండా వాడటమెలా

సెల్‌ఫోన్ వాడకం వల్ల ముప్పు ఉందని తెలిసినప్పటికీ వాడకుండా మాత్రం సా ధ్యం కాదు. అయితే,నష్టశాతాన్ని మా త్రం ఈ కింది సూచనలతో తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఫోన్‌ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి. ఫోన్ వాడకపోతే పక్కన పెట్టేయండి. ఆఫీస్‌లో ప నిచేస్తున్న సమయంలో డెస్క్‌పై ఫోన్‌పెట్టండి. ఫోన్ ఉపయోగం ఉంటేనే దా న్ని తీసుకోండి. లేదంటే మిగతా సమయాల్లో శరీరానికి వీలైనంత దూరంగా సెల్‌ఫోన్‌లను ఉంచండి.

నేటి తరుణంలో చాలా మంది బ్లూ టూత్, ఎన్‌ఎఫ్‌సీ హెడ్‌సెట్‌లను వాడుతున్నారు. కానీ అవి వాడటం మంచిదికాదు. వాటికి బదులుగా వైర్‌తో ఉన్న హెడ్‌సెట్‌లను వాడితే సెల్‌ఫోన్ రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు.

రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలా మంది ఫోన్‌ను తలపక్కనే పెట్టుకుని నిద్రిస్తారు. కానీ అ లా చేయరాదు. తలపక్కన ఫోన్ పెట్టకూడదు. ఫోన్‌లను జేబుల్లోకాకుండా ప్రత్యేక పర్సులో పెట్టుకోండి.

ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు ఎట్టిపరిస్థితుల్లనూ వాడకండి. అలాంటి సమయంలో వాటి నుంచి సాధారణ సమయాల్లో కంటే అధిక రేడియేషన్ విడుదలవుతోంది. కనుక చార్జింగ్ తీసి వాడటమే మంచింది.

గర్భిణీలు సెల్‌ఫోన్‌లను వీలైనంత తక్కువ వాడితే మంచిది. లేదంటే కడుపులో ఉండే శి శువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.