రోమ్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో నాదల్ 63, 61 తేడాతో అమెరి కా ఆటగాడు జాన్ ఇస్నర్‌ను చిత్తు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవలే మాడ్రిడ్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. తన దేశానికే చెందిన అల్కరాజ్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇలాంటి స్థితిలో ఇటలీ ఓపెన్ టైటిల్ గెలిచి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో నాదల్ ఉన్నాడు. ఇస్నర్‌పై గెలుపు నాదల్కు పెద్ద ఊరటనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ జ్వరేవ్ (జర్మనీ)లు కూడా తొలి రౌండ్లో విజయం సాధించారు.
Rafael nadal back after second round win at italian open