Saturday, April 20, 2024

దిగ్గజాలు లేకుండానే.. యూఎస్ ఓపెన్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రపంచ టెన్నిస్‌లోని అత్యుత్తమ టోర్నీల్లో ఒకటిగా పేరున్న ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ తొలిసారి దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే జరుగుతోంది. పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తులుగా కొనసాగుతున్న రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్(స్పెయిన్), నొవాక్ జకోవిచ్ (సెర్బియా)లు ఈసారి యూఎస్ ఓపెన్ బరిలోకి దిగడం లేదు. కరోనా నేపథ్యంలో ఏర్పడిన అల్లకల్లోల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దిగ్గజాలు ఈసారి యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అంతేగాక మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆశ్లే బార్టీ కూడా ఈసారి టోర్నీకి దూరమైంది. దీంతో పాటు ఇతర అగ్రశ్రేణి క్రీడాకారిణిలు స్విటోలినా(ఉక్రెయిన్), కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్) తదితరులు కూడా అందుబాటులో ఉండడం లేదు. అయితే మాజీ ఛాంపియన్లు ఫెదరర్, నాదల్‌లతో పాటు ప్రస్తుత విజేత జకోవిచ్ కూడా ఈసారి బరిలోకి దిగడం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా పురుషుల టెన్నిస్‌ను ఈ ముగ్గురే శాసిస్తున్న విషయం తెలిసిందే. గత 20 ఏళ్ల గ్రాండ్‌స్లామ్ రికార్డులను పరిగణలోకి తీసుకుంటే రెండు మూడుసార్లు తప్పించి దాదాపు అన్ని టోర్నమెంట్‌లలో ఈ ముగ్గురిలో ఎవరూ ఒకరూ విజేతగా నిలువడం అలవాటుగా వస్తోంది. మధ్యలో ఆండ్రీ ముర్రే, సోంగా తదితరులు ఒకటి రెండు టైటిల్స్ సాధించినా చాలా టోర్నీల్లో ఈ ముగ్గురే విజేతలుగా ఉంటూ వస్తున్నారు. ఈ స్టార్లు కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత వీరు లేకుండా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి కానుంది.

ఐదేళ్ల గ్రాండ్‌స్లామ్ టోర్నీల రికార్డులను పరిగణలోకి తీసుకుంటే ఫెదరర్, నాదల్, జకోవిచ్‌లే టైటిల్స్ సాధిస్తూ వస్తున్నారు. వీరు లేకుండా మిగతా వారు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి లేదు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. టెన్నిస్‌తో సహా దాదాపు అన్ని క్రీడలపై కరోనా పంజా విసిరింది. కరోనా దెబ్బకు ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని పూర్తిగా రద్దు చేశారు. ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఇక అమెరికా ఓపెన్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో పురుషుల టెన్నిస్‌ను శాసిస్తున్న ముగ్గురు దిగ్గజాలు లేకుండా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరుగుతుండడంతో అది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేగాక కరోనా బయటపడిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మాత్రమే. కానీ ఈ టోర్నీకి ఏకంగా ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కసారిగా దూరం కావడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు ఈ అంశం నిర్వాహకులను సయితం కలవరానికి గురిచేస్తోంది. కరోనా భయంతో ఒక్కో స్టార్ దూరం అవుతుండడంతో యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఆవేదనకు గురవుతున్నారు. అయితే సెరెనా, థిమ్, అజరెంకా, హలెప్, స్టిఫెన్స్, గాఫ్, సోంగా, సిట్సిపాస్, మెద్వెదేవ్, అలెగ్జాండర్ జ్వరెవ్ వంటి స్లార్లు బరిలో ఉండడంతో అభిమానులకు పసందన ఆటను చూసే అవకాశం దక్కనుంది. అంతేగాక సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న తొలి మెగా టోర్నీ కావడంతో అందరి దృష్టి యూఎస్ ఓపెన్‌పైనే నిలిచింది.

Rafael Nadal is not participate in US Open

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News