Home తాజా వార్తలు ‘ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు’ ట్రైల‌ర్ విడుద‌ల

‘ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు’ ట్రైల‌ర్ విడుద‌ల

'Raghupathi Venkaiah Naidu'హైదరాబాద్ :  తెలుగు సినిమా పితగా పిలుచుకునే ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు జీవిత నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. రఘుపతి వెంకయ్య పాత్రలో సీనియ‌ర్ న‌టుడు నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకి `రఘుపతి వెంకయ్య నాయుడు` అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు బాబ్జీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 29న విడుద‌ల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. యూనిట్ సభ్యులకు ఆయన అభినంద‌న‌లు తెలిపారు. ఈ సినిమాలో ఇంకా తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్‌, అఖిల్‌ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్‌, చాణక్య, దేవ్‌ రాజ్‌ తదితరులు నటించారు.

‘Raghupathi Venkaiah Naidu’ Trailer Release