Home జాతీయ వార్తలు దోపిడీ బాబు పుస్తకాన్ని ఆవిష్కరించిన రఘువీరా

దోపిడీ బాబు పుస్తకాన్ని ఆవిష్కరించిన రఘువీరా

RAGHUVEER-REDDY

విజయవాడ : టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు మూడేళ్ల పాలనపై దోపిడీ బాబు పేరుతో కాంగ్రెస్ నేతలు ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడేళ్ల బాబు పాలన అంతా అవినీతి రాజ్యమేలిందని ఆయన ఆరోపించారు. టిడిపి, బిజెపి మూడేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ప్రాజెక్టుల పేరుతో టిడిపి నేతలు కోట్లాది రూపాయలను దండుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. బాబు అవినీతి పాలనపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.