Tuesday, April 23, 2024

మోడీ ఖ్యాతిని జీర్ణించుకోలేని రాహుల్: బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మంగళవారం ప్రవాస భారతీయుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తుంటారని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం స్పందిస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.

రాహుల్ తన విదేశీ పర్యటనలలో భారత్‌ను అవమానించడం పరిపాటిగా మారిందని ఠాకూర్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన విదేశీ పర్యటనలో ప్రపంచదేశాలకు చెందిన 24 మంది ప్రధాన మంత్రులు, అధ్యక్షులను కలుసుకున్నారని, 50కి పైగా సమావేశాలలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ నా బాస్ అని ఆస్టేలియా ప్రధాన మంత్రే చెప్పారని, దీన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని ఠాకూర్ వ్యాఖ్యానించారు.

అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో మంగళవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన మొహబ్బత్ కీ దుకాన్‌లో రాహుల్ గాంధీ ప్రసగిస్తూ దేవుడి కన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే కొంతమంది భారత్‌లో ఉన్నారని, అందులో ప్రధాని మోడీ కూడా ఒకరని వ్యాఖ్యానించారు. దేవుడికి కూడా మోడీ విశ్వం గురించి పాఠాలు చెప్పగలరంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News