Tuesday, April 16, 2024

టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్

- Advertisement -
- Advertisement -

Rahul Dravid appointed head coach of India

 

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించారు. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్‌ను భారత క్రికెట్ బోర్డు ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బిసిసిఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే సిరీస్‌తో ద్రవిడ్ టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడుతాడు. ప్రస్తుతం ద్రవిడ్ బిసిసిఐ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నాడు. అంతేగాక అండర్19, ఇండియాఎ జట్లకు ప్రధాన కోచ్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు అపార అనుభవజ్ఞుడైన ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని బిసిసిఐ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఇటీవలే కోచ్ పదవి కోసం బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇక దీని కోసం ద్రవిడ్ ఒక్కడే దరఖాస్తు చేయడంతో అతని ఎంపిక లాంఛనమేనని అప్పడే తేలిపోయింది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ద్రవిడ్ టీమిండియాకు చిరస్మరణీయ సేవలు అందించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News