Thursday, April 25, 2024

లంక టూర్‌కు కోచ్‌గా ద్రావిడ్!

- Advertisement -
- Advertisement -

ముంబై : ఇప్పటికే రెండు సిరీస్‌కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో జట్టును పంపించాలని బిసిసిఐ నిర్ణయించింది. కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు మాత్రమే టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు వేర్వేరు జట్లను పంపించేవి. తాజాగా భారత క్రికెట్ బోర్డు కూడా వీరి బాటలోనే పయానిస్తోంది. ఇప్పటికే లంక సిరీస్ కోసం రిజర్వ్‌బెంచ్ ఆటగాళ్లతో రెండో జట్టును ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శిఖర్ ధావన్, పృథ్వీషా, భువనేశ్వర్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య తదితరులతో ఈ జట్టును ఎంపిక చేయనుంది.

ఇదిలావుండగా ఈ సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే ద్రవిడ్ ఇండియాఎ, ఇండియా జూ నియర్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. తాజాగా అతనికి పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ప్రధాన కోచ్‌గా నియమించాలని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక లంకతో జరిగే సిరీస్‌ను ఇప్పటికే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. మరోవైపు సిరీస్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బిసిసిఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ద్రవిడ్ అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్నే కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని బిసిసిఐ భావిస్తోంది. జట్టు ఎంపిక సమయంలోనే కోచ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీలో పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడికి వచ్చే క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా వారి ఫిట్‌నెస్ ప్రమాణాలు మెరుగయ్యేలా శిక్షణ ఇస్తున్నాడు.

Rahul Dravid as 2nd Coach to India of Sri Lanka tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News