Home తాజా వార్తలు ఆ సత్తా ద్రవిడ్‌కు ఉంది

ఆ సత్తా ద్రవిడ్‌కు ఉంది

Rahul dravid at helm players will get a lot of assurance

 

హర్భజన్

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్వాగతించాడు. రాహుల్ ద్రవిడ్ రాకతో భారత్ క్రికెట్‌కు ఎంతో మేలు జరగడం ఖాయమన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్టు సారథి విరాట్ కోహ్లితో కలిసి ద్రవిడ్ టీమిండియాకు కొత్త జనసత్వాలు తేవడం ఖాయమన్నాడు. ఈ ముగ్గురి కలయికతో భారత క్రికెట్ స్వరూపమే మారిపోయిన ఆశ్చర్యం లేదన్నాడు. ద్రవిడ్ కోచ్ బాధ్యతలు చేపట్టడంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందన్నాడు. తమకు తగినన్ని అవకాశాలు దొరుకుతాయనే నమ్మకం క్రికెటర్లలో నెలకొనడం ఖాయమన్నాడు. గతంలో తుది జట్టులో స్థానం ఉంటుందా లేదా అనే ఒత్తిడిలో చాలా క్రికెటర్లు ఉండేవారన్నాడు. కానీ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడంతో అలాంటి ఆందోళన ఆటగాళ్లలో కనిపించదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

Rahul dravid at helm players will get a lot of assurance