Home జాతీయ వార్తలు మోడీజీ… మౌనం వీడండి : రాహుల్

మోడీజీ… మౌనం వీడండి : రాహుల్

RAHUL;

ఢిల్లీ : కథువా, ఉన్నావ్ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈ ఘటనలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ రెండు ఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి ఉంటే, దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై మౌనం వీడాలని ఆయన మోడీని డిమాండ్ చేశారు. 2016లో దేశంలో 19,675 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగాయని రాహుల్ తెలిపారు. అత్యాచారం కేసుల్లో నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.