Home జాతీయ వార్తలు ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై రాహుల్ ధ్వజం

ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై రాహుల్ ధ్వజం

Rahul Gandhi Comments on RSS Leaders

అమేథీ : ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతలు జాతిపిత మహత్మాగాంధీ గురించి మాట్లాడుతారని, చేతల్లో మాత్రం నాథూరాం గాడ్సేను అనుసరిస్తారని ఆయన మండిపడ్డారు. చరిత్రను నాశనం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్వాతంత్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎటువంటి పాత్ర పోషించలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఇది దేశ ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

Rahul Gandhi Comments on RSS Leaders