Tuesday, April 23, 2024

మోడీది అబద్ధాల చరిత్ర

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi criticized Modi

అందుకే రైతులు నమ్మడం లేదు : రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: అబద్ధాల(అసత్యాగ్రహం) విషయంలో ప్రధాని మోడీకి దీర్ఘ చరిత్ర ఉన్నదని, అందుకే రైతులు ఆయణ్ని నమ్మడంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారంటూ 2014 ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, కరోనాపై యుద్ధంలో 21 రోజుల్లో విజయం సాధిస్తామంటూ లాక్‌డౌన్ సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని రాహుల్ ట్విట్ చేశారు. మన దేశంలోకి ఎవరూ చొరబడలేదు, ఏ ఒక్క పోస్ట్‌నూ ఆక్రమించలేదు అంటూ చైనా దురాక్రమణ ప్రయత్నంపై మోడీ వ్యాఖ్యల్ని రాహుల్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రధాని మోడీ విశ్వసనీయత కోల్పోయారని రాహుల్ విమర్శించారు. రైతుల పట్ల మోడీ వ్యవహరిస్తున్న తీరుపై ఆన్‌లైన్ సర్వేను రాహుల్ చేపట్టారు. ప్రస్తుతం తన అమ్మమ్మతోపాటు అనారోగ్యంతో ఉన్న ఓ బంధువును పరామర్శించేందుకు ఇటలీ వెళ్లిన రాహుల్ ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News