Home జాతీయ వార్తలు నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌ గాంధీ…

నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌ గాంధీ…

Rahul Gandhiలక్నో: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో నామినేషన్‌ వేయనున్నారు. బుధవారం ఆయన తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు ఎఐసిసి కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఈ రోజు అమేథీలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఆ రోడ్‌ షోలో ప్రియాంకా గాంధీ తనయుడు రైహన్‌, కూతురు మిరయా కూడా పాల్గొన్నారు.

అమేథీలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి రాహుల్‌ తల్లి సోనియా గాంధీ నేరుగా తన కారులో వచ్చారు. రాహుల్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం విదితమే. కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేయబోతున్నారు. అక్కడ ఆయన ఇటీవలే నామినేషన్‌ వేశారు.

Rahul Gandhi nomination

Rahul Gandhi holds mega road show in Amethi