Home జాతీయ వార్తలు మధ్యప్రదేశ్‌లో రాహుల్ నిర్బంధం

మధ్యప్రదేశ్‌లో రాహుల్ నిర్బంధం

మంద్‌సౌర్ రైతు ఆందోళనకారులను కలుసుకోవడానికి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
రాజస్థాన్ నుంచి బైక్‌పై వెళ్లిన కాంగ్రెస్ నేత

rahulనయాగావ్: మధ్యప్రదేశ్‌లో రైతుల ఉద్యమం గురువారం మరో మలుపు తిరిగింది. రైతులపై కాల్పులు జరిగిన మంద్‌సౌర్‌ను సందర్శించడానికి నిషేధాజ్ఞలు ధిక్కరించి వెళ్లుతున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకుని, నిర్బంధంలోకి తీసుకున్నారు. తన పర్యటనకు పోలీ సులు అనుమతిని ఇవ్వకపోయినా వారి కళ్లుగప్పి అక్కడికి వెళ్లి బాధిత రైతులకు సంఘీభావం తెలియచేయాలని రాహుల్ సంకల్పించారు. దీనితో గురువారం ఉదయం నుంచే ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు కాల్పులలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సంతాపం తెలియచేయా ల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ ప్రకటిం చారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల సాయంతో ఓ బృందంగా రాహుల్ పర్యటన నీమూచ్‌లోని నయాగావ్ నుంచి బయలుదేరింది. జై జవాన్ జై కిసాన్ , రాహుల్ గాంధీ జిందాబాద్ నినాదాల మధ్య ఈ ప్రాంతం అట్టుడికిపోయింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 4౦౦ కిలోమీటర్ల దూరంలో ఉన్న నయాగావ్ వద్దనే పోలీసులు భారీ స్థాయిలో మెహరించి , రాహుల్ ను నిర్బంధంలోకి తీసుకుని, ఓ బస్సులోకి రాహుల్‌ను ఎక్కించి ఓ అజ్ఞాత ప్రాంతానికి తీసు కువెళ్లిన పోలీసులు ఈ ఘటన గురించి, రాహు ల్‌ను ఎక్కడికి తీసుకువెళ్లారనే అంశం గురించి వెంటనే వెల్లడించలేదు. అయితే స్థానిక కాంగ్రెస్ నేతల నిరసనతో ఓ అధికారి దీనిపై వివరణ ఇచ్చారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఆయనను ఇతరులను అదుపులోకి తీసుకుని , ఓ సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్‌హౌజ్‌కు తీసుకువెళ్లినట్లు తెలిపారు. రుణాల మాఫీ ఇతర సమస్యల పరి ష్కారానికి మంద్‌సౌర్ ప్రాంతంలో రైతులు ప్రదర్శనకు దిగిన క్రమంలో వారిని అడ్డుకునేం దుకు పోలీసులు కాల్పులు సాగించారు. ఈ ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందడంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల నిరసనలలో పాలు పంచుకోవడానికి రాహుల్ ఇక్కడికి చేరారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున, చివరికి అధికారులు కూడా ఇక్కడికి వెళ్లలేని స్థితి ఉన్నందున ఈ పర్యటనను విరమించుకోవాలని రాహుల్‌కు స్థానిక ఉన్నతాధికారులు సూచించారు.
రైతులకు బుల్లెట్లు, సంపన్నులకు మాఫీలా ?
మంద్‌సౌర్‌కు యాత్రను ప్రారంభించే ముందు రాహుల్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వంపై , మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల మోడీకి కనికరం లేదని రాహుల్ విమర్శించారు. సంపన్నులకు లక్షన్నర కోట్ల మేర రుణ మాఫీ చేసిన మోడీ రైతులకు ఎందుకు పంట రుణాల మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర లేదని, వారికి ఇతరత్రా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలను ఇవ్వని మోడీ , ఇదేమిటని అడిగిన రైతులపై చివరికి తూటాలు పేలుస్తున్నారని మండిపడ్డారు. రైతుల కు పరిహారం ఇవ్వరు. వారికి ప్రోత్సాహకాలు లేవు, ఇందుకు పలు కారణాలను చెప్పే మోడీ ప్రభుత్వం ఎంతో ఉదారంగా కార్పొరేట్ ప్రము ఖులకువేల కోట్లలో రుణమాఫీలు చేశారని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నేతలు వెంటరాగా, వందలాది మంది కార్యకర్తలు తోడా నిలవగా రాహుల్ మంద్‌సౌర్ వైపు కదిలారు.